অন্নময়্য় কীর্তন মেলুকো শ্রুংগাররায়
Sri Venkateswara Swamy · প্রথাগত ভক্তিপাঠ
రాగం: భూపాళ ఆ: స రి1 గ2 ప ద1 స అవ: స ద1 ప గ2 రి1 స తాళం: ఆది పల్లవి మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల । మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ॥ (2) చరణం 1 సందడిచే గోపికల జవ్వనవనములోన । కందువందిరిగే మదగజమవు । (2) యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని । గంధము మరిగినట్టి గండు తుమ్మెద ॥ (2) మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల..(ప..) చరణం 2 గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో । రతిముద్దు గురిసేటి రాచిలుకా । (2) సతుల పదారువేల జంట కన్నుల గలువల- । కితమై పొడిమిన నా యిందు బింబమ ॥ (2) మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల..(ప..) చరణం 3 వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై । నిరతి వాలిన నా నీలమేఘమా । (2) శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద । గరిమ వరాలిచ్చే కల్పతరువా ॥ (2) మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల । మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ॥
অন্নময়্য় কীর্তন মেলুকো শ্রুংগাররায় সম্পর্কে
"Meluko Shringararaya" is an Annamacharya waking song (meluko) in raga Bhupalam, adi tala, sung at dawn to rouse the Lord: "Wake up, O Shringara Raya, king of love, noble Madana Gopala; wake up, my protector, my hidden treasure." The charanams call him the proud elephant roaming the youthful forest of the gopis, the bee that savours the fragrance in the lotus heart of moon-faced Satyabhama, the royal parrot in the cage of Rukmini's embrace, and the dark rain cloud resting on the hills.
রচয়িতা: Tallapaka Annamacharya (15th century)
কখন পাঠ করবেন: At dawn, in suprabhatam and temple waking rituals, and in concerts.
আপনি কি জানেন?
- Bhupalam is a traditional morning raga, often used for waking songs.
- Meluko songs, which wake the deity at dawn, are a favourite form in Annamacharya's works.
প্রায়শই জিজ্ঞাসিত প্রশ্ন
What does "meluko" mean?
"Wake up".
In which raga is it set?
Bhupalam, a morning raga.
Who composed it?
Tallapaka Annamacharya.
উপাসনা ও অধ্যয়নের জন্য প্রদত্ত, ভবিষ্যদ্বাণী হিসেবে নয়। অবাণিজ্যিক।
আরও ভক্তিপাঠ