MuhurtaNow

Annamayya Keerthanas Ammamma Emamma

Sri Venkateswara Swamy · Traditional devotional text

రాగం: భైరవి ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ । తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥ చరణం 1 నీరిలోన తల్లడించే నీకే తలవంచీ నీరికింద పులకించీ నీరమణుండు । (2) గోరికొన చెమరించీ కోపమే పచరించీ సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ॥ (1.5) అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ । తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥ (ప.) (2) చరణం 2 నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ మేకొని నీవిరహాన మేను వెంచీని । (2) ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ॥ (1.5) అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ । తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥ (ప.) (2) చరణం 3 చక్కదనములె పెంచీ సకలము గాలదంచి నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని । (2) మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ॥ (2.5) అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ । తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥ (ప.) (2)

About Annamayya Keerthanas Ammamma Emamma

"Ammamma Emamma" is an affectionate Annamacharya sankirtana in raga Bhairavi and adi tala, addressed to Alamelumanga, the consort of Venkateshwara: "Oh Mother, what is this, Alamelmanga Nanchcharamma? Come and blossom in your lotus home, dear lady." In the charanams, the poet lovingly describes the goddess and her bond with the Lord of the seven hills.

Written by: Tallapaka Annamacharya (15th century)

When to chant: In concerts and bhajans, on Fridays, and in Padmavati worship at Tiruchanur.

Did you know?

  • Alamelumanga, "the lady of the lotus", is Padmavati, worshipped at Tiruchanur near Tirupati.
  • "Nanchcharamma" is a loving, familiar way of addressing the Mother.

Frequently asked questions

Whom does the song address?

Alamelumanga (Padmavati), consort of Venkateshwara.

Which raga is it in?

Bhairavi, adi tala, as the text gives.

Who composed it?

Tallapaka Annamacharya.

Offered for worship and study, not as prediction. Non-commercial.