MuhurtaNow

Annamayya Keerthanas Chaaladaa Brahmamidi

Sri Venkateswara Swamy · Traditional devotional text

రాగం: సింధుభైరవి ఆ: స రి2 గ2 మ1 గ2 ప ద1 ని2 స అవ: ని2 ద1 ప మ1 గ2 రి1 స ని2 స తాళం: ఖండచాపు పల్లవి చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు । జాలెల్ల నడగించు సంకీర్తనం ॥ (2) చరణం 1 సంతోష కరమైన సంకీర్తనం । సంతాప మణగించు సంకీర్తనం । (2) జంతువుల రక్షించు సంకీర్తనం । సంతతము దలచుడీ సంకీర్తనం ॥ చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు..(ప..) చరణం 2 సామజము గాంచినది సంకీర్తనం । సామమున కెక్కుడీ సంకీర్తనం । సామీప్య మిందరికి సంకీర్తనం । సామాన్యమా విష్ణు సంకీర్తనం ॥ చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు..(ప..) చరణం 3 జముబారి విడిపించు సంకీర్తనం । సమ బుద్ధి వొడమించు సంకీర్తనం । జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం । శమదమాదుల జేయు సంకీర్తనం ॥ చరణం 4 జలజాసనుని నోరి సంకీర్తనం । చలిగొండ సుతదలచు సంకీర్తనం । చలువ గడు నాలుకకు సంకీర్తనం । చలపట్టి తలచుడీ సంకీర్తనం ॥ చరణం 5 సరవి సంపదలిచ్చు సంకీర్తనం । సరిలేని దిదియపో సంకీర్తనం । సరుస వేంకట విభుని సంకీర్తనం । సరుగనను దలచుడీ సంకీర్తనం ॥ చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడగించు సంకీర్తనం ॥ (2)

About Annamayya Keerthanas Chaaladaa Brahmamidi

"Chaaladaa Brahmamidi" is an Annamacharya sankirtana in raga Sindhubhairavi and khanda chapu tala, in praise of singing God's names: "Is this sankirtana not enough for you? It is Brahman itself." The poet says that the singing of Venkateshwara's names melts away all troubles, that it is the essence of the Vedas, and that nothing more is needed.

Written by: Tallapaka Annamacharya (15th century)

When to chant: In bhajans and concerts, and in group nama sankirtana.

Did you know?

  • It celebrates sankirtana, the singing of God's names, which Annamacharya made his life's work.
  • Annamacharya is said to have composed 32,000 sankirtanas, preserved on copper plates at Tirumala.

Frequently asked questions

What does "Chaaladaa Brahmamidi" mean?

"Is this not enough? This is Brahman itself."

What does it praise?

Sankirtana, the singing of the Lord's names.

Which raga is it in?

Sindhubhairavi, khanda chapu tala, as the text gives.

Offered for worship and study, not as prediction. Non-commercial.