Annamayya Keerthanas Chaaladaa Hari Naama
Sri Venkateswara Swamy · Traditional devotional text
రాగం: హంసధ్వని 29 ధీర శంకరాభరణం జన్య ఆ: స రి2 గ3 ప ని3 స అవ: స ని3 ప గ3 రి2 స తాళం: ఆది / ఖండ చాపు పల్లవి చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు । చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ (3) చరణం 1 ఇది యొకటి హరి నామ మింతైన జాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ । (2) మదినొకటె హరినామ మంత్రమది చాలదా । (2) పదివేల నరక కూపముల వెడలించ ॥ చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు । చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ చరణం 2 కలదొకటి హరినామ కనకాద్రి చాలదా । తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ । తెలివొకటి హరినామదీప మది చాలదా । కలుషంపు కఠిన చీకటి పారద్రోల ॥ చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు । చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ చరణం 3 తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా । జగములో కల్పభూజంబు వలె నుండ । (2) సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా । (2) నగవు జూపులను నున్నతమెపుడు జూప ॥ చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు । చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ (2) గోవింద హరి జయ గోపాల హరి జయ ...
About Annamayya Keerthanas Chaaladaa Hari Naama
"Chaalada Hari Nama" is one of Annamacharya's best-known sankirtanas, sung in raga Hamsadhvani: "Is not the blissful nectar of Hari's name enough for us? Is it not enough to give us every sweet and good taste?" Each charanam asks again, "is it not enough?": the one name of Hari, to free us from the prisons of endless births; the one mantra of Hari's name in the mind, to lead us out of ten thousand pits of hell; the golden mountain of Hari's name; the lamp of Hari's name to bring understanding.
Written by: Tallapaka Annamacharya (15th century)
When to chant: In bhajans and concerts, in group singing, and as a daily chant.
Did you know?
- Hamsadhvani is a bright raga, often used to open concerts.
- The song is a celebration of nama sankirtana, the singing of the Lord's name, as complete in itself.
Frequently asked questions
What does "Chaalada" mean?
"Is it not enough?"
What is the song about?
The sufficiency of Hari's name.
Who composed it?
Tallapaka Annamacharya.
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts