Annamayya Keerthanas Itarulaku Ninu
Sri Venkateswara Swamy · Traditional devotional text
రాగం: బేగడ ఆ: స గ3 రి2 గ3 మ1 ప ద2 ని2 ద2 ప స అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స తాళం: క్/చాపు పల్లవి ఇతరులకు నిను నెరుగదరమా ॥ సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర- హితులెరుగుదురు నిను నిందిరారమణా ॥ చరణం 1 నారీ కటాక్ష పటు నారాచ భయరహిత- శూరులెరుగుదురు నిను జూచేటి చూపు । (2) ఘోరసంసార సంకుల పరిచ్ఛేదులగు- ధీరులెరుగుదురు నీదివ్య విగ్రహము ॥ ఇతరులకు నిను నెరుగదరమా.. (ప..) చరణం 2 రాగభోగవిదూర రంజితాత్ములు మహా- భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము । (2) ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా- యోగులెరుగుదురు నీవుండేటివునికి ॥ ఇతరులకు నిను నెరుగదరమా.. (ప..) చరణం 3 పరమభాగవత పదపద్మసేవానిజా- భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు । (2) పరగునిత్యానంద పరిపూర్ణమానస- స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ ॥ ఇతరులకు నిను నెరుగదరమా ॥ సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర- హితులెరుగుదురు నిను నిందిరారమణా ॥
About Annamayya Keerthanas Itarulaku Ninu
"Itarulaku Ninu Nerugadarama" is an Annamacharya sankirtana in raga Begada and chapu tala: "Is it possible for others to know you? Only those ever true to their vows, wholly free from delusion, know you, beloved of Indira (Lakshmi)." The charanams say: heroes unafraid of the sharp arrows of women's glances know the look of your eyes; the steadfast who have cut through the tangled web of worldly life know your divine form; noble souls whose hearts are free of desire and pleasure know how to praise you; and those who follow the ways taught in the scriptures know you truly.
Written by: Tallapaka Annamacharya (15th century)
When to chant: In concerts and bhajans, and in Venkateshwara worship.
Did you know?
- Begada is a rich, stately raga, often used for songs of reflection.
- The song teaches that the Lord is known through inner purity, not through outward cleverness.
Frequently asked questions
Who can know the Lord, according to the song?
Those true to their vows and free of delusion.
Which raga is it in?
Begada.
Who composed it?
Tallapaka Annamacharya.
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts