Annamayya Keerthanas Muddugaare Yasoda
Sri Venkateswara Swamy · Traditional devotional text
రాగం: సారన్గనాట ఆ: స రి1 మ1 ప ద1 స అవ: స ని3 స ద1 ప మ1 గ3 రి1 స తాళం: ఆది పల్లవి ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు । తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ॥ (2) చరణం 1 అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము । పంత మాడే కంసుని పాలి వజ్రము । కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస । చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు ॥ ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు..(ప..) చరణం 1 రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము । మితి గోవర్ధనపు గోమేధికము । సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము । గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ॥ ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు..(ప..) చరణం 2 కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము । యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము । పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము । బాలునివలె దిరిగీ బద్మ నాభుడు ॥ ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు..(ప..)
About Annamayya Keerthanas Muddugaare Yasoda
"Muddugare Yashoda" is one of Annamacharya's most famous songs, in raga Kurinji or Saranganata: "This one is the pearl in Yashoda's courtyard, overflowing with charm; the son of Devaki, of unmatched glory." The song compares Krishna to the nine precious gems: he is the ruby in the palms of the gopis, the diamond that crushed Kamsa, the emerald that lights the three worlds, the coral of Rukmini's lips, the gomedha of Govardhana, the vaidurya between conch and discus, the topaz on Kaliya's heads, the sapphire of Venkatadri, and the pearl of the ocean of milk.
Written by: Tallapaka Annamacharya (15th century)
When to chant: In concerts, bhajans and dance recitals, and on Krishna Janmashtami.
Did you know?
- The song is built on the navaratna, the nine gems, each matched to a scene from Krishna's life.
- It became widely loved through recordings by great Carnatic singers and is a staple of dance recitals.
Frequently asked questions
What does "Muddugare Yashoda" mean?
"Overflowing with charm, Yashoda's darling".
To what does the song compare Krishna?
To the nine precious gems.
Who composed it?
Tallapaka Annamacharya.
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts