E Desamegina
Telugu Songs · Traditional devotional text
ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము.
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో జనియించినాడ వీ స్వర్గఖండమున ఏ మంచిపూవులన్ ప్రేమించినావో నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
లేదురా ఇటువంటి భూదేవి యెందూ లేరురా మనవంటి పౌరులింకెందు. సూర్యునీ వెలుతురుల్ సోకునందాక, ఓడలా ఝండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ వీర భావ భారతము.
తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా సౌర్య హారముల్ రాజచంద్రులర్పింప భావ సూత్రము కవి ప్రభువులల్లంగ రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక
దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా జగములనూగించు మగతనంబెగయ సౌందర్యమెగ బోయు సాహిత్యమలర
వెలిగినదీ దివ్య విశ్వంబుపుత్ర దీవించె నీ దివ్య దేశంబు పుత్ర పొలములా రత్నాలు మొలిచెరా ఇచట వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట
పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకూ కానలా కస్తూరి కాచరా మనకు.
అవమానమేలరా ? అనుమానమేలరా ? భారతేయుడనంచు భక్తితో పాడ!
About E Desamegina
"E Desamegina" is a Telugu patriotic song: "Whatever land you go to, wherever you set foot, whatever seat you rise to, whoever speaks ill, praise your mother, Mother India, and uphold the full honour of your people." It recalls the virtues of the land that bore you, its treasures and healing herbs, and asks why one should feel shame or doubt in being Indian.
Written by: Rayaprolu Subba Rao (1892 to 1984)
When to chant: On Independence Day, Republic Day and at school functions.
Did you know?
- Rayaprolu Subba Rao was a pioneer of modern Telugu poetry and wrote several songs of the freedom era.
- It ends with a call to sing with devotion "I am an Indian", "bharatiyudananchu bhaktito pada".
Frequently asked questions
What kind of song is it?
A Telugu patriotic song in praise of Mother India.
Who wrote it?
The Telugu poet Rayaprolu Subba Rao.
When is it sung?
On Independence Day, Republic Day and at school programmes.
Offered for worship and study, not as prediction. Non-commercial.