MuhurtaNow

Gopala Krishna Dasavatharam

Vishnu · Traditional devotional text

మల్లెపూలహారమెయ్యవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే

మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణ మత్స్యావతారుడనెద

కుప్పికుచ్చుల జడలువెయ్యవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే

కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణ కూర్మావతారుడనెద

వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వరహావతారుడనవే

వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణ వరహావతారుడనెద

నాణ్యమైన నగలువేయవే ఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే

నాణ్యమైన నగలువేసెదా గోపాలకృష్ణ నరసింహావతారుడనెద

వాయువేగ రథమునియ్యవే ఓయమ్మ నన్ను వామనవతారుడనవే

వాయువేగ రథమునిచ్చెదా గోపాలకృష్ణ వామనావతారుడనెద

పాలు పోసి బువ్వపెట్టవే ఓయమ్మ నన్ను పరశురామావతారుడనవే

పాలు పోసి బువ్వపెట్టెద గోపాలకృష్ణ పరశురామావతారుడనెద

ఆనందబాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ్యవాసుడనవే

ఆనందబాలుడనెద గోపాలకృష్ణ అయోధ్యవాసుడనెద

గోవులుకాచె బాలుడనవె ఓయమ్మ నన్ను గోపాలకృష్ణుడనవే

గోవులుకాచె బాలుడనెద నా తండ్రి నిన్ను గోపాలకృష్ణుడనెద

బుధ్ధులు కలిపి ముద్దపెట్టవే ఓయమ్మ నన్ను బుధ్ధావతారుడనవే

బుధ్ధులు కలిపి ముద్దపెట్టెద గోపాలకృష్ణ బుధ్ధావతారుడనెద కాళ్ళకు పసిడిగజ్జెలు కట్టవే ఓయమ్మ నన్ను కలికావతారుడనవే

కాళ్ళకు పసిడిగజ్జెలు కట్టెద గోపాలకృష్ణ కలికావతారుడనెద

About Gopala Krishna Dasavatharam

"Gopala Krishna Dasavataram" is a playful Telugu folk song between little Krishna and his mother. The child asks, "Put a jasmine garland on me, mother, and call me the Matsya avatara," and the mother answers, "I will put the jasmine garland on you, Gopala Krishna, and call you Matsya." So it goes through all ten avataras, Kurma, Varaha, Narasimha, Vamana, Parashurama, Rama of Ayodhya and the others, each with a small gift such as braids, a chariot or a bowl of milk rice, ending with golden anklets and Kalki.

When to chant: As a children's song, at home bhajans, and on Krishna Janmashtami.

Did you know?

  • Each pair of lines is a request by Krishna and his mother's loving reply, which makes it easy for children to sing in turns.
  • The song is a gentle way to teach children the names of the ten avataras of Vishnu.

Frequently asked questions

What is this song about?

Little Krishna asking his mother to call him by each of the ten avataras.

Who sings the replies?

His mother, promising each small gift he asks for.

Which avatara comes last?

Kalki, with golden anklets.

Offered for worship and study, not as prediction. Non-commercial.