MuhurtaNow

अन्नमय्य कीर्तन विन्नपालु विनवलॆ

Sri Venkateswara Swamy · पारंपरिक भक्ति पाठ

రాగం: భూపాళ / భూపాళం ఆ: స రి1 గ2 ప ద1 స అవ: స ద1 ప గ2 రి1 స తాళం: ఝంప పల్లవి విన్నపాలు వినవలె వింత వింతలు । పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5) చరణం 1 తెల్లవారె జామెక్కె దేవతలు మునులు । అల్లనల్ల నంతనింత నదిగోవారే । (2) చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు । మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ॥ (1.5) విన్నపాలు వినవలె వింత వింతలు । పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5) చరణం 2 గరుడ కిన్నరయక్ష కామినులు గములై । విరహపు గీతముల వింతాలాపాల । (2) పరిపరివిధముల బాడేరు నిన్నదివో । సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ॥ (1.5) విన్నపాలు వినవలె వింత వింతలు । పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5) చరణం 3 పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు । పంకజభవాదులు నీ పాదాలు చేరి । (2) అంకెలనున్నారు లేచి అలమేలుమంగను । వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ॥ (2) విన్నపాలు వినవలె వింత వింతలు । పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5)

अन्नमय्य कीर्तन विन्नपालु विनवलॆ के बारे में

"Vinnapalu Vinavale" is a morning awakening song (melukolupu) by Annamacharya, in raga Bhupalam and jhampa tala: "Please hear our many wondrous petitions; it is time to lift the mosquito-curtain of your serpent bed." As dawn breaks, the gods and sages gather all around; the poet asks the Lord to open his cool, lotus-petal eyes slowly and wake. Women of the Garudas, Kinnaras and Yakshas sing songs of longing; Shesha and the others wait; so lift your lovely face and pay attention.

रचयिता: Tallapaka Annamacharya (15th century)

कब पढ़ें: At dawn, in the morning service (Suprabhata seva) of Vishnu temples, and at home.

क्या आप जानते हैं?

  • Bhupalam is a traditional morning raga, often used for songs that wake the deity.
  • Such awakening songs belong to the same tradition as the Venkateshwara Suprabhatam sung at Tirumala.

अक्सर पूछे जाने वाले प्रश्न

What kind of song is this?

A dawn song to wake the Lord.

Which raga is it in?

Bhupalam, a morning raga, in jhampa tala.

Who composed it?

Tallapaka Annamacharya.

उपासना और अध्ययन के लिए प्रस्तुत, भविष्यवाणी के रूप में नहीं। गैर-व्यावसायिक।