Vemana Padyalu
Vemana · ಸಾಂಪ್ರದಾಯಿಕ ಭಕ್ತಿ ಪಠ್ಯ
Verses 1–50
1
అల్పుఁ డెపుడు బల్కు నాడంబరము గాను సజ్జనుండు బలుకుఁ జల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వదాభిరామ వినర వేమ!
2
గంగిగోవుపాలు గరిటెడైనను జాలు కడివెడైననేమి ఖరముపాలు భక్తిగలుగుకూడు పట్టెడైనను జాలు విశ్వదాభిరామ వినర వేమ!
3
చదువులందు రాజపదవులందును పాడి మొదవులందు స్త్రీల పెదవులందు నాశ లుడుగునట్టి యయ్యలు ముక్తులు విశ్వదాభిరామ వినర వేమ!
4
వినవలె నెవ్వరు చెప్పిన వినినంతనె తమకపడక వివరింపవలె విని కని వివరము దెలిసిన మనుజుఁడెపో నీతిపరుడు మహిలో వేమా!
5
కులము లో నొకండు గుణవంతు డుండెనా కులము వెలయు వాని గుణముచేత వెలయ వనము లోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినర వేమ!
6
తప్పు లెన్నువారు తండోపతండము- లుర్వి జనులకెల్ల నుండుఁ దప్పు తప్పు లెన్నువారు తమతప్పు నెఱుఁగరు విశ్వదాభిరామ వినర వేమ!
7
ధనము గూడఁబెట్టి ధర్మంబు సేయక తాను దినకలెస్స దాచుగాఁక తేనె నీఁగె కూర్చి తెరువర్ల కియ్యదా విశ్వదాభిరామ వినర వేమ!
8
ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండుఁ జూడఁ జూడ రుచుల జాడ వేఱు పురుషులందు పుణ్య పురుషులు వేఱయా విశ్వదాభిరామ వినర వేమ!
9
కుక్కతోలు దెచ్చి యెఱుపుబొమ్మను జేసి యాడునట్టుచేసి యట్టెవేసె తన్నుఁ ద్రిప్పువానిఁ దానేలకానఁడో విశ్వదాభిరామ వినర వేమ!
10
అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినఁగ దినఁగ వేము దీయనుండు సాధనమున బనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినర వేమ!
11
ఇదియ పరమటంచు నితరచింతలు వీడి మనసుఁ జెదరనీక మట్టుపఱచి కొదువలేక నిలువ కోర్కెలు ఫలియించు మనసులోన నుండు మహిమ వేమ!
12
ఎంతచదువుఁ జదివి యెన్ని విన్నను గాని హీనుఁ డవగుణంబు మానలేఁడు బొగ్గు పాలఁగడుగఁ బోవునా మలినంబు విశ్వదాభిరామ వినర వేమ!
13
చదువు చదువ నేల సన్యాసి గానేల షణ్మతములఁజిక్కి చావ నేల అతని భజనఁజేసి యాత్మలోఁ దెలియుఁడీ విశ్వదాభిరామ వినర వేమ!
14
అన్ని దానములను నన్నదానమె గొప్ప కన్నవారికంటె ఘనులు లేరు ఎన్న గురునికన్న నెక్కువలేదయా విశ్వదాభిరామ వినురవేమ!
15
అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా విశ్వదాభిరామ వినురవేమ !
16
చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు మేలు వచ్చెనేని మెచ్చుఁ దన్ను చేటు మేలుతలఁపుఁ జేసినకర్మముల్ విశ్వదాభిరామ వినర వేమ!
17
చంద్రునంతవాడె శాపంబుచేతను కళల హీనమంద గలిగె గదర పుడమి జనులకెల్ల బుద్దులిట్లుండురా! విశ్వదాభిరామ వినురవేమ!
18
అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె పిన్న పెద్దతనము లెన్నలేల పిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదా విశ్వదాభిరామ వినర వేమ!
19
అంగ మెల్ల వదలి, యటు దంతములు నూడి తనువు ముదిమిచేతఁ దఱుచు వడక ముప్పు తిప్పలఁ బడి మోహంబు విడువడు విశ్వదాభిరామ వినర వేమ!
20
తల్లిదండ్రులెన్నఁ దనతొలి గురులు పార్వతీభవులును పరమగురువులు కూలివాండ్ర జగతి గురు లన ద్రోహంబు విశ్వదాభిరామ వినర వేమ!
21
అంగమందు లింగ మతిశయంబునఁ గట్టి లింగమందు ముక్తి నిలుపలేరు ముక్తిలేక తుదను మూర్ఖుఁడై పోవురా విశ్వదాభిరామ వినర వేమ!
22
అండములో నాకాశం బుండంగాఁ జూడఁజూడ నొనరుఁగ దీనిపై యుండును నన్నియుఁ దెలిసిన మెండుగ నెటుచూచి చన్నమేలగు వేమా!
23
అంధులైన వారు నందు నిం దనకుండు నన్నితావులందు హరునివలెను తెలియువారి కెల్ల దేవుఁడే కనుపించు విశ్వదాభిరామ వినర వేమ!
24
అగ్నిబాణముచేత అంబుధింకినపుడె రాముడవలి కేగులావుమరచె వరుస కొండలమోసి వారధేటికికట్టె విశ్వదాభిరామ వినురవేమ!
25
అతిథిరాకచూచి యదిలించిపడవైచి కఠినచిత్తులగుచు కానలేరు కర్మబుద్ధులగుచు ధర్మంబు సేయరు విశ్వదాభిరామ వినురవేమ!
26
అధికుడైనరాజు నల్పును చేపట్టు వానిమాట చెల్లు వసుధలోన గణికులొప్పియున్న గవ్వలు చెల్లవా విశ్వదాభిరామ వినర వేమ!
27
అన్నమదమువలన నతివలు పురుషులు ఏపురేఁగి మదనుఁ డేఁచె నందు రన్న ముడుగువెనుక నతఁ డెందుఁబోయెరా విశ్వదాభిరామ వినర వేమ!
28
అమ్మసుమీ యా లనఁగా నమ్మనఁగా నాలు సుమ్మియాయిద్దరిని¦ ఇమ్మహిలోఁ బరమాత్ముని నెమ్మదిలోఁ దెలియఁ దానె నేర్పరి వేమా!
29
అరయ లజ్జజూడ అందరు యుందుండు లజ్జలేనివాడు లాలితుండె లజ్జగల్గువాని లాభంబు లేమయా! విశ్వదాభిరామ వినురవేమ!
30
అల్పబుద్ధివాని కధికార మిచ్చిన దొడ్డవారినెల్లఁ తొలఁగఁగొట్టు చెప్పుతినెడికుక్క చెఱకుతీ పెఱుఁగునా విశ్వదాభిరామ వినర వేమ!
31
అష్టకష్టు బ్రదుకు నగ్నిపాలై పోవు నిర్దయాత్ము బ్రతుకు నీటఁగలియు క్రూరకర్ముబ్రతుకు చోరులపాలౌను విశ్వదాభిరామ వినర వేమ!
32
ఆకులెల్లఁదిన్న మేఁకపోతుల కేల గాకపోవునయ్య కాయసిద్ధి లోకులెల్ల వెఱ్ఱి పోకళ్ళఁ బోదురు విశ్వదాభిరామ వినర వేమ!
33
ఆత్మయందు జ్యోతి యెఱుగుట లింగంబు తెలిసిచూడగాను తేటపడును అదియు గురువులేక యబ్బునా తెలియంగ విశ్వదాభిరామ వినర వేమ!
34
ఆపగాళి వెంట అడవుల వెంటను కొండరాళ్ళ వెంట గొడవ యేల నుల్లమందె శివుఁడు ఉండుటఁ దెలియరు విశ్వదాభిరామ వినర వేమ!
35
ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి వేఱుపడెడువాఁడు వెఱ్ఱివాఁడు కుక్కతోఁకఁ బట్టి గోదావ రీఁదునా విశ్వదాభిరామ వినర వేమ!
36
ఆలు సుతులు ధనము లరయంగ మీరని మొనసి కర్మమునను మోసపోయి కాలు గన్నయపుడు కడతేరజాలడు విశ్వదాభిరామ వినురవేమ!
37
ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు కట్టుపడుచు ముక్తిగానరైరి జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో విశ్వదాభిరామ వినుర వేమ!
38
ఇంటియాలు విడిచి యిల జారకాంతల వెంటఁ దిరుగువాఁడు వెఱ్ఱివాఁడు పంటచేను విడిచి పరిగ యేరినయట్లు విశ్వదాభిరామ వినర వేమ!
39
ఇంద్రియ పరవశుఁ డధముం డింద్రియ పరవశుఁడు భక్తియెడ మధ్యముండౌ నింద్రియజయుఁ డుత్తముఁ జి తేంద్రియసుతుఁడు విన మహేశుఁడు వేమా!
40
ఇట్టికనుల బ్రహ్మ మెట్లు చూడఁగవచ్చుఁ జూచుకనులువేఱు చూపువేఱు చూపులోనమరిచి చూడంగవలవదా విశ్వదాభిరామ వినర వేమ!
41
ఇసుక బొగ్గు రాయి యినుమును చర్మంబు కసపుపొల్లుకట్టి కట్టబెట్టి పల్లుదోమినంత పరిశుద్ధులగుదురా విశ్వదాభిరామ వినురవేమ!
42
ఈఁకె లండఁజేసి తోఁక లండలఁజేసి కోక లండఁజేసి కొఱఁతమాపె నాకు లండఁజేసి నఖిల జంతువులకు విశ్వదాభిరామ వినర వేమ!
43
ఉండియుండు జ్ఞాని యుగములు చనినను బ్రాణహాని లేదు ప్రళయమునను బ్రాణహానియైనఁ పరమాత్ము గలియునో విశ్వదాభిరామ వినర వేమ!
44
ఉన్న సరికి మనుజుఁ డుపకారి గాలేక కన్నుగనక పల్కుగర్వములను దీనులయినవారి దిగువారిగాఁజూచి పరము గనకనూత బడును వేమ!
45
ఉర్వి గురుని వేడి యబ్బురపడువాడు దబ్బరాడబోడు తత్తరమున నిబ్బరంపు మదిని నిర్విణ్ణతనుగాంచు విశ్వదాభిరామ వినురవేమ!
46
ఊరు ననుచునుండ నొగి సంతసింతురు అడవియనుచు నుండ నడలుచుందు రూరు నడవి రెండు నొకటిగాఁ జూచిన నారితేఱు యోగి యతఁడు వేమా!
47
ఎండయన తిరుగు నిర వెఱింగిన యోగి యుండు నెల్లకాల ముర్విలోనఁ దిండిపోతు వశమె తెలియంగ జ్ఞానంబు విశ్వదాభిరామ వినర వేమ!
48
ఎంతసేవఁజేసి యేపాటుపడినను రాచమూక నమ్మరాదు రన్న పాముతోడిపొందు పదివేలకైనను విశ్వదాభిరామ వినర వేమ!
49
ఎట్టివాఁడు తానో యెఱుఁగడు తొలిపుట్టు నీచబ్రతుకుకింత నీమమేల కష్టనరుల కెల్ల కలుగునా మోక్షంబు విశ్వదాభిరామ వినర వేమ!
50
ఎన్ని మతములైన జరుగఁ దగదు సత్య మింతలేక జరుగఁ దగదు సత్యము గలవాఁడు జగతిలో ద్విజుఁ డయ్యె విశ్వదాభిరామ వినర వేమ!
Vemana Padyalu ಬಗ್ಗೆ
ವೇಮನ ಪದ್ಯಗಳು ಯೋಗಿ ವೇಮನನ ಚಿಕ್ಕ ತೆಲುಗು ಪದ್ಯಗಳು, ತೆಲುಗಿನಲ್ಲಿ ಅತ್ಯಂತ ಉಲ್ಲೇಖಿತ ಸಾಲುಗಳಲ್ಲಿ ಸೇರಿದವು. ಸರಳ, ನೆಲದ ಮಾತುಗಳಲ್ಲಿ ಪ್ರತಿ ಪದ್ಯ ಜೀವನದ ಒಂದು ಸತ್ಯ ಬೋಧಿಸುತ್ತದೆ: ಹುಟ್ಟು ಅಥವಾ ಸಂಪತ್ತಿಗಿಂತ ಸನ್ನಡತೆಯ ಬೆಲೆ, ಅಹಂಕಾರ ಮತ್ತು ಡಾಂಭಿಕತೆಯ ಮೂರ್ಖತನ, ಶುದ್ಧ ಹೃದಯವಿಲ್ಲದ ಆಚರಣೆಯ ಪೊಳ್ಳುತನ, ಆತ್ಮಜ್ಞಾನದ ಮಹತ್ವ. ಹೆಚ್ಚಿನ ಪದ್ಯಗಳು "ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿನುರ ವೇಮ" ಎಂಬ ಅಂಕಿತದೊಂದಿಗೆ ಮುಗಿಯುತ್ತವೆ.
ರಚನೆಕಾರರು: ಯೋಗಿ ವೇಮನ
ಯಾವಾಗ ಪಠಿಸಬೇಕು: ಓದು ಮತ್ತು ಚಿಂತನೆಗಾಗಿ, ಯಾವಾಗ ಬೇಕಾದರೂ; ಶಾಲೆಗಳಲ್ಲಿ ಮಕ್ಕಳು ಇವನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡುತ್ತಾರೆ.
ನಿಮಗೆ ಗೊತ್ತೇ?
- ವೇಮನನ ಕಾಲ ಸಂಪ್ರದಾಯದಂತೆ ಸುಮಾರು ೧೭ನೇ ಶತಮಾನ; ಅವನ ಜೀವನದ ವೃತ್ತಾಂತಗಳು ಭಿನ್ನವಾಗಿವೆ.
- ಅವನ ಪದ್ಯಗಳು ಸರಳ ಆಟವೆಲದಿ ಛಂದಸ್ಸಿನಲ್ಲಿದ್ದು ನೆನಪಿಡಲು ಸುಲಭ.
- ಉಪ್ಪು ಕರ್ಪೂರ ನೋಡಲು ಒಂದೇ ರೀತಿ ಕಂಡರೂ ರುಚಿ ಬೇರೆ; ಹಾಗೆಯೇ ಜನರಲ್ಲಿ ಪುಣ್ಯಪುರುಷರು ಬೇರೆಯೇ ಎನ್ನುವುದು ಅವನ ಪ್ರಸಿದ್ಧ ಪದ್ಯಗಳಲ್ಲಿ ಒಂದು.
ಪದೇ ಪದೇ ಕೇಳುವ ಪ್ರಶ್ನೆಗಳು
ವೇಮನ ಯಾರು?
ಸಂಪ್ರದಾಯದಂತೆ ಸುಮಾರು ೧೭ನೇ ಶತಮಾನದ ತೆಲುಗು ಕವಿ ಮತ್ತು ಯೋಗಿ.
ಅವನ ಅಂಕಿತ ಯಾವುದು?
"ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿನುರ ವೇಮ".
ಅವನ ಪದ್ಯಗಳು ಏನನ್ನು ಬೋಧಿಸುತ್ತವೆ?
ನಡತೆ, ವಿನಯ ಮತ್ತು ಪ್ರಾಮಾಣಿಕ ಆಂತರಿಕ ಜೀವನದ ಸರಳ ಸತ್ಯಗಳು.
ಆರಾಧನೆ ಮತ್ತು ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ ನೀಡಲಾಗಿದೆ, ಭವಿಷ್ಯವಾಣಿಯಾಗಿ ಅಲ್ಲ. ವಾಣಿಜ್ಯೇತರ.
ಇನ್ನಷ್ಟು ಭಕ್ತಿ ಪಠ್ಯಗಳು