MuhurtaNow
Draft, pending review. Not yet listed publicly.

Vemana Padyalu

Vemana · ಸಾಂಪ್ರದಾಯಿಕ ಭಕ್ತಿ ಪಠ್ಯ

Verses 51–100

51

ఎప్పుడు చూచిన న్నితర మేమియుఁ జూడక ముక్తి యందుఁగ ఱెప్పల మూసి మూయకయ రేయిఁ బగ ళ్ళొకరీతి నుండఁగా దప్పుల నొందఁ జేయు యమ ధర్ముని పాలికినొంద నేర్చునే చెప్పఁగ నేమి వేమనకు జెల్లునుముక్తి విధానమంతయున్‌!

52

ఎఱుక నెఱుగువాని కెఱుక యే నడుచును ఎఱుకలేనివాఁడు నెఱుఁగలేఁడు ఎఱుకలోని యెఱుక నెఱుఁగుట తత్వంబు విశ్వదాభిరామ వినర వేమ!

53

ఎలుకతోక దెచ్చి యెందాక నుతికిన నలుపుగాక యేల తెలుపు గలుగు కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన గుణియౌనె విశ్వదాభిరామ వినర వేమ!

54

ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవుఁ పుట్టువేళ నరుఁడు గిట్టువేళ ధనము లెచటి కేఁగు దానేగు నెచటికి విశ్వదాభిరామ వినర వేమ!

55

ఒకటిక్రింద నొక్క డొనర లబ్ధముఁ బెట్టి వలనుగ గుణియింప వరుసఁ బెరుఁగు నట్టిరీతి నుండు నౌదార్యఫలములు విశ్వదాభిరామ వినర వేమ!

56

ఒరులకొఱకు భూమి నొరసెటివారును అవనిపతికి వశ్యులయినవారు పాలవంటివారు పన్ను పెట్టెడువారు వాకెఱుంగరు శాఖవారు వేమా!

57

కొంకణంబు పోఁవగుక్క సింహము గాదు కాశిబోవఁబంది గజము గాదు వేఱె జాతివాఁడు విప్రుఁడు గాఁడయా విశ్వదాభిరామ వినర వేమ!

58

కొండఱేఁడు మామ కొండకూతురు నాలు కొండ యిల్లు పసిఁడికొండ విల్లు కొండవంటి దొరకు గుండురూపంబురా విశ్వదాభిరామ వినర వేమ!

59

కచ్చమీఁద నాస కనకంబుపై నాస లేనివాఁడు పుడమి లేనివాఁడు కలిగెనేని యతఁడు గానంగ రాఁడయా విశ్వదాభిరామ వినర వేమ!

60

కడక నఖిలమునకు నడినాళమన్ దున్న వేఁగుచుక్కవంటి వెలుఁగు దిక్కు వెలుఁగుకన్న దిక్కు వేఱెవ్వ రున్నారు విశ్వదాభిరామ వినర వేమ!

61

కడుపునిండ సుధను గ్రమముతోఁ ద్రావిన బాలమీఁద నేల పాఱు మనసు? తత్వ మెఱుఁగువెనుక తన్వంగు లేటికో? విశ్వదాభిరామ వినర వేమ!

62

కనకమందు, మంచి కాంతల వాడల వలసియుందు రెంతవారలైన తోయజాక్షి బాయు దొరలెవ్వరును లేరు విశ్వదాభిరామ వినురవేమ!

63

కనియుఁ గాన లేఁడు కదలింపఁ డానోరు వినియు వినగ లేఁడు విస్మయమున సంపద గల వాఁడు సన్నిపాతక మది విశ్వదాభిరామ వినర వేమ!

64

కప్పయు పామును బోరఁగ కప్పను నాపాముమ్రింగె కడువేడుకతో కప్పను చెడలందిగిచెడి విప్పను నా చొప్పు దెలియ వేమననేర్చు!

65

కోమటినిష్ఠలు గుఱికి రావెన్నఁడు లోభగుణము చేతలోని కడఁగు పులియు దాసరి కీడుపొలువగు చందమౌ విశ్వదాభిరామ వినర వేమ!

66

కర్మాకర్మము లొక్కటి కర్మవినోదునకు దత్వఘనునకు దెలియు ధర్మాధర్మము లేర్పడ నిర్మలమతి తెలుపవలయు నిజముగ వేమా!

67

క్రొవ్వు పొట్టపొరలు క్రూరకర్ములపొరల్‌ నొవ్వఁ జేసినట్టి రవ్వపొరలు నెవ్వరైన నేమి యినజువాకిటఁ గాని యవ్వలికిని బోవునటర వేమ!

68

కాలచక్ర మెఱుఁగఁగా లేక యెప్పుడు సంధ్యజపముసేయు జాణలార సంధ్యజపములోన జాడ లెట్లుండును విశ్వదాభిరామ వినర వేమ!

69

కాలము తన కిక చాలా కాలము గలదంచునున్న కాలమునందు కూళఁడు తను దాఁదెలియక కూలును తొలిజామునందు గొబ్బున వేమా!

70

కల్లుకుండ భూతి గట్టిగా పెట్టిన అందులోని కంపు అడుగునెట్లు మెడను త్రాడు వేయ మెరయు ద్విజుడౌనె విశ్వదాభిరామ వినురవేమ!

71

కాళ్ళ ముంద ఱేకు కడతేర నీదక ముగ్గురు ముగురాండ్ర మునిఁగినారు నరుఁడు నీఁదెదనుట నగుబాటు గాదయా విశ్వదాభిరామ వినర వేమ!

72

కష్ట లోభి వాని కలిమికి నాశించి బడుగు వాఁడు దిరిగి పరిణమించు తగరు వెంట నక్క దగిలిన చందంబు విశ్వదాభిరామ వినర వేమ!

73

కుండఁగుంభ మండ్రు కొండఁ బర్వతమండ్రు ఉప్పు లవణ మండ్రు నొకటి గాదె భాషలింతెవేఱు పరతత్వ మొక్కటి విశ్వదాభిరామ వినర వేమ!

74

కుక్కల దిని కడుబాపలు నక్కను భుజియించువారు నాకేశులగు చొక్కముగ జీవహత్యల మిక్కుటముగఁ జేసి తమిని మించిరి వేమా!

75

కులమునీరుచేసి గురువు వధియింప పొసగ నేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెను వేపవి త్తయా! విశ్వదాభిరామ వినురవేమ!

76

కూడు గుడిచి లెస్స గూర్చున్నవాఁడైన నాడుదానిఁ గన్న నట్టె తగులు నన్న సారమొడలి కతిమదం బిడుసుమీ విశ్వదాభిరామ వినర వేమ!

77

గంగ పారు చుండు కదలని గతి తోడ ముఱికి కాల్వ పారు మ్రోఁత తోడ దాత యోర్చునట్లధము డోర్వఁగా లేఁడు విశ్వదాభిరామ వినర వేమ!

78

గాడ్దె యేమెఱుంగు గంధంబు వాసన కుక్క యేమెఱుంగు గొప్పబుద్ధి అల్పుఁడే మెఱుంగు హరునిఁ గొల్చు విరక్తి విశ్వదాభిరామ వినర వేమ!

79

గీము విడిచి సుగుడి గిక్కురుమన కుండు జీవు విడుచువేళ శివునిఁ దలఁచు మనసు గొల్పకయును మాయచేఁ బొరలెడు పాపనరుల కేటి పరము వేమ!

80

గురుఁ డనఁగా పరమాత్ముఁడు పరగంగా శిష్యుఁడనఁగఁ బటుజీవుఁడగు గురుశిష్య జీవసంపద గురుతరముగఁ గూర్చు నతఁడు గురువగు వేమా!

81

గురునితోడ బొందు కూడియుండినవాడు చేరి బ్రహ్మనంటి చెలగియుండు మరుగు తెలిసెనేని మర్మంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమ!

82

గురువుఁగూడుఁజేసి గుణము వత్తిగఁజేసి సరవిఁగర్మఁ జమితి సమురుఁ జేసి మూల నొక్కజ్యోతి ముట్టించి చూడరా విశ్వదాభిరామ వినర వేమ!

83

చంపఁదగిన యట్టి శత్రువు తన చేతఁ జిక్కెనేని కీడు సేయ రాదు పొసఁగ మేలు జేసి పొమ్మనుటే చాలు ! విశ్వదాభిరామ వినర వేమ!

84

చచ్చెఁ జచ్చె ననుచుఁ చావుకు వగచెడు దీననరుల వెఱ్ఱి దెలుపరాదు ప్రాణమునకు మృత్యు బంధంబు లుడుగునా విశ్వదాభిరామ వినర వేమ!

85

చాడికానిమాట చావడిలో నిక్కు వెంటఁ బో శునకము వెలయ నిక్కు స్త్రీలఁజూచినపుడు శిశ్నంబు నిక్కురా విశ్వదాభిరామ వినర వేమ!

86

చిత్తవాజి నెక్కి శిక్షింప నేరక తత్తఱించి రౌతు తరల నేల వారణాసి తనకు వయ్యాళి కాబోలు విశ్వదాభిరామ వినర వేమ!

87

చదువులెల్ల చదివి సర్వజ్ఞుఁడై యుండు బ్రహ్మవిద్యలెల్ల పదటఁ గలిపి యిఱుకుయోనిఁ జూచి పరమయోగము మాను విశ్వదాభిరామ వినర వేమ!

88

చమురు గలుగు దివ్వె సరవితో మండును చమురు లేని దివ్వె సమసి పోవు తనువు తీఱె నేని తలపు తోడనె తీరు విశ్వదాభిరామ వినర వేమ!

89

చూచువారికెల్లఁ జూడ వేఱైయుండు చూపుఁజూచి దెలియఁ జూచువారు చూచి తాముచూపుచూపె తామగుదురు విశ్వదాభిరామ వినర వేమ!

90

జ్ఞానముద్రచేతఁ గానవచ్చెడితళ్కు నదియ మదికి శ్రేష్ఠ మనుచు మునులు పలికి రదియుఁ దెలియఁ బరమార్థ మగునయా విశ్వదాభిరామ వినర వేమ!

91

జాతులందు నెట్టిజాతి ముఖ్యముచూడు మెఱుఁగలేక దిరుగ నేమిగలదు యెఱుక గలుగు మనుజుఁ డేజాతి గలవాఁడు విశ్వదాభిరామ వినర వేమ!

92

జాణలమని యంద్రు చపలాత్ములగువారు తెలివిలేక తమ్ముతెలియలేరు కష్టమైన యడవి గాసీలుచున్నారు విశ్వదాభిరామ వినుర వేమ!

93

జీవగుణము గల్గుజీవుండు బ్రహ్మంబు సాటివచ్చునెట్లు సరవితోడ నూరికుక్క సింగమొకటి జేయురా విశ్వదాభిరామ వినర వేమ!

94

తండ్రికన్న సుగుణి తనయుఁడు గల్గెనా పిన్న తనము లెన్న మిన్నగాదు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ వినుర వేమ!

95

తాతఁ గన్నతల్లి తనతండ్రిఁ గనుతల్లి తన్నుఁగన్న తల్లి తల్లితల్లి తల్లి శూద్రురాలు తానెట్లు బాపడో విశ్వదాభిరామ వినర వేమ!

96

తొత్తుతోడిపొందు తొఱ్ఱిపెసలమూట ముచ్చుతోడిపొందు తెచ్చునింద తలవరింటిపొందు తలతోటిదీరురా విశ్వదాభిరామ వినర వేమ!

97

తానె తత్వమనుచు తన్నెఱుంగక లేక మాయతత్వమనుచు మఱుగుచుండు ధర్మకర్మములను తగరోయ దత్వమౌ విశ్వదాభిరామ వినర వేమ!

98

తనకు లేనివాఁడు దైవముందూఱును తనకుఁ గలిగెనేని దైవ మేల తనకు దైవమునకుఁ తగులాటమేశాంతి విశ్వదాభిరామ వినర వేమ!

99

తనదుదాన మవనిఁ దనకూఁతు సమమగు తండ్రిదాన మెల్లఁ దనకుఁ దోడు అన్యు లిచ్చుదాన మది తనవంటిది విశ్వదాభిరామ వినర వేమ!

100

తన్నెఱుఁగనివాఁడు తానె తానై యుండుఁ దన్నెఱుంగువాఁడు తానె తాను తనువులేనివాఁడు తానె తానౌనయా విశ్వదాభిరామ వినర వేమ!

Vemana Padyalu ಬಗ್ಗೆ

ವೇಮನ ಪದ್ಯಗಳು ಯೋಗಿ ವೇಮನನ ಚಿಕ್ಕ ತೆಲುಗು ಪದ್ಯಗಳು, ತೆಲುಗಿನಲ್ಲಿ ಅತ್ಯಂತ ಉಲ್ಲೇಖಿತ ಸಾಲುಗಳಲ್ಲಿ ಸೇರಿದವು. ಸರಳ, ನೆಲದ ಮಾತುಗಳಲ್ಲಿ ಪ್ರತಿ ಪದ್ಯ ಜೀವನದ ಒಂದು ಸತ್ಯ ಬೋಧಿಸುತ್ತದೆ: ಹುಟ್ಟು ಅಥವಾ ಸಂಪತ್ತಿಗಿಂತ ಸನ್ನಡತೆಯ ಬೆಲೆ, ಅಹಂಕಾರ ಮತ್ತು ಡಾಂಭಿಕತೆಯ ಮೂರ್ಖತನ, ಶುದ್ಧ ಹೃದಯವಿಲ್ಲದ ಆಚರಣೆಯ ಪೊಳ್ಳುತನ, ಆತ್ಮಜ್ಞಾನದ ಮಹತ್ವ. ಹೆಚ್ಚಿನ ಪದ್ಯಗಳು "ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿನುರ ವೇಮ" ಎಂಬ ಅಂಕಿತದೊಂದಿಗೆ ಮುಗಿಯುತ್ತವೆ.

ರಚನೆಕಾರರು: ಯೋಗಿ ವೇಮನ

ಯಾವಾಗ ಪಠಿಸಬೇಕು: ಓದು ಮತ್ತು ಚಿಂತನೆಗಾಗಿ, ಯಾವಾಗ ಬೇಕಾದರೂ; ಶಾಲೆಗಳಲ್ಲಿ ಮಕ್ಕಳು ಇವನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡುತ್ತಾರೆ.

ನಿಮಗೆ ಗೊತ್ತೇ?

  • ವೇಮನನ ಕಾಲ ಸಂಪ್ರದಾಯದಂತೆ ಸುಮಾರು ೧೭ನೇ ಶತಮಾನ; ಅವನ ಜೀವನದ ವೃತ್ತಾಂತಗಳು ಭಿನ್ನವಾಗಿವೆ.
  • ಅವನ ಪದ್ಯಗಳು ಸರಳ ಆಟವೆಲದಿ ಛಂದಸ್ಸಿನಲ್ಲಿದ್ದು ನೆನಪಿಡಲು ಸುಲಭ.
  • ಉಪ್ಪು ಕರ್ಪೂರ ನೋಡಲು ಒಂದೇ ರೀತಿ ಕಂಡರೂ ರುಚಿ ಬೇರೆ; ಹಾಗೆಯೇ ಜನರಲ್ಲಿ ಪುಣ್ಯಪುರುಷರು ಬೇರೆಯೇ ಎನ್ನುವುದು ಅವನ ಪ್ರಸಿದ್ಧ ಪದ್ಯಗಳಲ್ಲಿ ಒಂದು.

ಪದೇ ಪದೇ ಕೇಳುವ ಪ್ರಶ್ನೆಗಳು

ವೇಮನ ಯಾರು?

ಸಂಪ್ರದಾಯದಂತೆ ಸುಮಾರು ೧೭ನೇ ಶತಮಾನದ ತೆಲುಗು ಕವಿ ಮತ್ತು ಯೋಗಿ.

ಅವನ ಅಂಕಿತ ಯಾವುದು?

"ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿನುರ ವೇಮ".

ಅವನ ಪದ್ಯಗಳು ಏನನ್ನು ಬೋಧಿಸುತ್ತವೆ?

ನಡತೆ, ವಿನಯ ಮತ್ತು ಪ್ರಾಮಾಣಿಕ ಆಂತರಿಕ ಜೀವನದ ಸರಳ ಸತ್ಯಗಳು.

ಆರಾಧನೆ ಮತ್ತು ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ ನೀಡಲಾಗಿದೆ, ಭವಿಷ್ಯವಾಣಿಯಾಗಿ ಅಲ್ಲ. ವಾಣಿಜ್ಯೇತರ.

ಇನ್ನಷ್ಟು ಭಕ್ತಿ ಪಠ್ಯಗಳು