Vemana Padyalu
Vemana · പരമ്പരാഗത ഭക്തിഗ്രന്ഥം
Verses 151–200
151
బ్రహ్మ యెవనికొడుకు పరికింపఁగా భువి విష్ణు వెవనికొడుకు వెలయఁజూడ శివుఁడు నెవనికొడుకు సిగ్గెఱుఁగరు జనుల్ విశ్వదాభిరామ వినర వేమ!
152
బ్రహ్మమేడ ననుచు పలుమాఱు లాడేరు వెఱ్ఱిమూర్ఖ జనుల విధముఁజూడ బ్రహ్మ మన్నిటందుఁ పరిపూర్ణమైయుండు విశ్వదాభిరామ వినర వేమ!
153
బైలున బంధము గలపక వ్రాలెను పరమాత్మునకును వాంఛిత మొప్ప బైలున బంధము గలిపిన కైలాసముఁజేరి ముక్తి గాంచుర వేమా!
154
భోగంబుల కాశింపక రాగద్వేషంబు రంగుడదమలో వేగమె మోక్ష పదంబును రాగను నాతండు యోగిరాయుడు వేమా!
155
భూతి దేహమందుఁ బూసిన నాయెనా నిష్ఠ శివునియందె నిలుపవలయుఁ గాని భస్మమందు గాడిదె పొర్లదా విశ్వదాభిరామ వినర వేమ!
156
మంచివారు లేరు మహిమీఁద వెదకినఁ గష్టు లెందరైనఁ గలరు భువిని పసిఁడి లేదె గాని సదడెంత లేదయా విశ్వదాభిరామ వినర వేమ!
157
మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకుగరుణచెందినదని వేదపఠన చేసి వెఱ్ఱులై పోదురు, విశ్వదాభిరామ వినుర వేమ!
158
మాట లెల్ల కల్ల, మన సెల్ల దొంగకె నేటి ప్రాణ మింక నేటి బ్రతుకు? మాట సత్యమైన మఱి శతాయుష్యంబు విశ్వదాభిరామ వినర వేమ!
159
మాటలాడవేఱె మనసుకొలఁదియువేఱె యొడలగుణమువేఱె యోజనవేఱె యెట్లుగల్గు ముక్తి యేలాగు తనలాగు విశ్వదాభిరామ వినర వేమ!
160
మాదిగ చెవులను మనసులోఁ బెట్టుక మాదిగలను దెగడు మాదిగపుడు మంచిగుణములేక మఱిద్విజుఁ డెట్లగు విశ్వదాభిరామ వినర వేమ!
161
మదిని గానవలెను మఱిబ్రహ్మమూర్తిని మదినిగన్నవారు మహినిలేరు వెదకి తనువులోన వేడ్కతో నెఱిఁగిన యతఁడె యోగివరుఁడు నగును వేమా!
162
మధురసములు గోరి మక్షికంబులు చేరి చొచ్చి వెడలలేక చచ్చున్నట్లు మునిగిఁ వెడల లేఁడు మోహంబు రాశిలో విశ్వదాభిరామ వినర వేమ!
163
మానసంపురక్తి మసలక యాత్మలో బోడితలల సొంపు పొల్పుమీఱ కడుపుకొఱకుఁ దిరుగు కష్టంపుమతితోడ విశ్వదాభిరామ వినర వేమ!
164
మనసుఁ బాఱవీడి మనసుఁ దా మగుడించి మనసులోనఁగలుగు మర్మమెఱిగి మనసు తాను నిల్ప మఱియుఁదా బ్రహ్మంబు విశ్వదాభిరామ వినర వేమ!
165
మనసులోనివాని మానుగాఁ దెలిసిన నుర్విజనులువాని యోగి యండ్రు నీవె నిన్నెఱుంగ నీవెపో శివుఁడవు విశ్వదాభిరామ వినర వేమ!
166
మాయలోనఁ బుట్టి మాయలోననె పెరిగి మాయఁ దెలియలేని మనుజుఁడేల మాయఁ దెలియువాఁడు మహిమీఁద ధన్యుండు విశ్వదాభిరామ వినర వేమ!
167
పర్వత వనవాసి పరిణామ వర్తన కూపవాసి కెట్టు గుఱుతుపడును బ్రహ్మవిష్ణువెంటఁ బ్రాకృతుఁ డరుగునా విశ్వదాభిరామ వినర వేమ!
168
మాలవాని నంటి మఱినీళ్లు మునిగేరు మనుజకర్మచేత మాలఁడయ్యె నేలతెలియలేరో యీ నరపశువులు విశ్వదాభిరామ వినర వేమ!
169
ముక్కుత్రాళ్ళ గ్రుచ్చి ముఱికిపోవఁగఁ దోమి కచ్చనీరు నించి కడిగి కడిగి డొక్క దోమినంత దొరకునా తత్వంబు విశ్వదాభిరామ వినర వేమ!
170
మునిఁగి మునిఁగి మునిఁగి ముద్దయై ముద్దయై వనరి వనరి వనరి వక్కి వక్కి తిరిగి తిరిగి తిరిగి దిమ్మరై యుండును విశ్వదాభిరామ వినర వేమ!
171
మూఢ భక్తిచేత ముక్కంటి బూజింప మున్ను బోయవరుడు ముక్తుడాయె పూజలేమి? తనదు బుద్ధిప్రధానము విశ్వదాభిరామ వినురవేమ!
172
మదము వలన గలుగు మాటలు మఱిపల్కి మ్రుచ్చు సద్దులనొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్ఠుండు గురుడౌనే? విశ్వదాభిరామ వినుర వేమ!
173
రేచకపూరక కుంభక సూచకములు రాజయోగి సుస్థిరమతియై లోచూపుచూడనొల్లక వాచాబ్రహ్మంబు పలుకవద్దుర వేమా!
174
రతిలేక ముదియు నంగన రతి కలిగిన ముదియు నశ్వరత్నము ధరలో సతతము భ్రాంతిని చేసెడు తతిరతిచే ముదియు నరుఁడు తథ్యము వేమా!
175
రుద్రరూపుఁ దాల్చి రుద్రుని నిందించి భ్రష్టుత్రోవఁ దిరుగు భ్రష్టజనులు ఱంకులకునుదిరుగు రమణులవలె నుండు విశ్వదాభిరామ వినర వేమ!
176
రూపువంక పేరు రూఢిగా నిలుచును పేరువంక క్రియలు పెనగుచుండు నాశమౌను తుదకు నామరూప క్రియల్ విశ్వదాభిరామ వినురవేమ!
177
లోకములకు గురువు లోకులకును గుర్వు వదియుఁ దెలისი మోక్ష మందుగోరి గురునిఁ గనక నరక కూపము నందురు విశ్వదాభిరామ వినర వేమ!
178
లోభమోహములును ప్రాభవములుదప్పు దలఁచిన పనులెల్లఁ దప్పిచనును తా మొకటి దలంప దైవమొక్కటిఁదల్చు విశ్వదాభిరామ వినర వేమ!
179
వండివచ్చునపుడు వంటక మమృతంబు కంటికింపుగాను కానుపించు నొడలతినినదిండి వడిమించ గడిదేఱు విశ్వదాభిరామ వినర వేమ!
180
వాడకుఱికి తిట్టు వలదన్న మొఱఁబెట్టు ముందు మగనిఁ దిట్టు ముసుఁగుపెట్టు గడుసురాలు మగని గంపఁ బెట్టమ్మురా విశ్వదాభిరామ వినర వేమ!
181
విత్తనంబు గురువు విశ్వంబునకు నెల్ల ప్రణవమంత్ర మరయ పరమ గురువు కర్మ గురువు సుమ్ము గాయత్రిమంత్రంబు విశ్వదాభిరామ వినురవేమ!
182
వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి భ్రమలపెట్టి తేటపడగ నీవు గుప్తవిద్య యొకటె కులకాంతవంటిది విశ్వదాభిరామ వినర వేమ!
183
వినియు వినకయుండు వెఱ్ఱివాఁడై యుండు కనియుఁ గానకుండు కడఁగి యోగి మనుజవరులచేత మఱిపూజఁ గొనుచుండు విశ్వదాభిరామ వినర వేమ!
184
వేమన పద్యము లన్నిటి సామంబునఁ జదివినట్టి సజ్జను లెల్ల సోమనతల సుందరు కడు నేమంబునఁ జూడరయ్య నేర్పున వేమ!
185
వాయువందె పుట్టి వాయువందె పెఱిగి వాయువందు మేలు వరుసఁ దెలియ వాయువందు ప్రాణవాయువు తత్వంబు విశ్వదాభిరామ వినర వేమ!
186
వెఱ్ఱినక్కలవలె వేదముల్ చదివెద రాశయంబు లెఱుఁగరయ్య వారు వేదసారమంత వేమన యెఱుఁగును విశ్వదాభిరామ వినర వేమ!
187
వెలయాలి వలనఁ గూరిమి కలుగదు, మఱి కలిగెనేని కడతేరదురా పలువురు నడిచెడి తెరువున పులు మొలవదు, మొలిచెనేని పొదలదు వేమా!
188
వైష్ణవుల మటంచు వార్తమాత్రమె కాని భ్రష్టు లంతకన్న వేఱులేరు చారు బలమదైన నీరుగాఁ బోవునా విశ్వదాభిరామ వినర వేమ!
189
వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భండి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ!
190
శతసంఖ్యపదమ్ముల నే మతిమంతుఁడు పఠనసేయు మమతులు దీరు న్నతఁడే నాలుగుపదముల శితికంఠునిపదముఁ జేరు సిద్ధము వేమా!
191
శివుఁడు బ్రహ్మ మనుచు స్మృతులెల్లఁ బలుకంగ వేఱె దైవములను వేయిగొల్చి బ్రహ్మజనులు చూడ భ్రష్టులైపోయిరి విశ్వదాభిరామ వినర వేమ!
192
శుద్ధదృష్టిఁ దెలిసి శుక్రునంతటివాఁడు పట్టలేక మనసు పాఱవిడిచి కన్నుపోయి పిదప కాకిచందం బయ్యె విశ్వదాభిరామ వినర వేమ!
193
సకలాకారుఁ డనంతుఁడు సకలాత్ములయందు సర్వసాక్షియుఁ దానే సకలమున నిర్వికారుం డకలంకస్థితిని బ్రహ్మ మగునుర వేమా!
194
సిగ్గువారల మని సృష్టిలోపలివారు వెఱ్ఱివేమనఁ గని వెఱఁగుపడిరి తనకుఁ గలుగుసిగ్గు దైవ మెఱుంగురా విశ్వదాభిరామ వినర వేమ!
195
స్త్రీలసుఖముఁ జూచి చిత్తంబు నిలుకడ సేయని మనుజుండు చెడు నిజంబు ఏటికట్టు మ్రాని కెప్పుడు చలనంబు విశ్వదాభిరామ వినర వేమ!
196
స్థిరముగాని క్షుద్రపర నటనలుచేసి హెచ్చుతగ్గు లొంది హీనమతులు గాడ్దెపిల్ల లరుతుఁ గ్రక్కునఁ జెడుదురు విశ్వదాభిరామ వినర వేమ!
197
సమమునైన దృష్టి సమముగా మదినిల్పి బయలురుచులు మాని భద్రముగను పరగఁజూడ బట్టబయలగు బ్రహ్మంబు విశ్వదాభిరామ వినర వేమ!
198
సర్వము తానని తెలిసిన నిర్వాణికిఁ గాక ముక్తి నిలుపఁగ వశమా ఉర్వెల్లఁ దాను తిరిగిన పర్వత బిలజలధులందుఁ బడినను వేమా!
199
సూక్ష్మరూప మెఱిగి సుఖమొందగా లేక బహుళముగను జదువఁబడుచు నరుఁడు చావుచేటెఱుఁగని చదువేల చదువునో విశ్వదాభిరామ వినర వేమ!
200
హీననరులతోడ నింతులతోడను పడుచువాండ్రతోడ ప్రభువుతోడ ప్రాజ్ఞ జనులతోడ బ్రహ్మఘ్న జనులతో వైపు దెలిసి పలుకవలయు వేమ!
Vemana Padyalu - ഒരു പരിചയം
Vemana Padyalu are the short Telugu verses of Yogi Vemana, among the most quoted lines in Telugu. In plain, earthy words, each verse teaches a truth about life: the worth of a good character over birth or wealth, the folly of pride and hypocrisy, the emptiness of ritual without a pure heart, and the value of self-knowledge. Most verses end with the signature "Vishvadabhirama vinura Vema".
രചയിതാവ്: Yogi Vemana
എപ്പോൾ ജപിക്കാം: For reading and reflection, at any time, and in schools, where children learn them by heart.
നിങ്ങൾക്കറിയാമോ?
- Vemana is traditionally dated to around the 17th century, though accounts of his life vary.
- His verses are in the simple ataveladi metre, which makes them easy to remember.
- One of his best-known verses says that salt and camphor look alike but taste very different; so too, among people, the truly good stand apart.
പതിവ് ചോദ്യങ്ങൾ
Who was Vemana?
A Telugu poet and yogi, traditionally dated to around the 17th century.
What is his signature line?
"Vishvadabhirama vinura Vema".
What do his verses teach?
Plain truths about character, humility and sincere inner life.
ആരാധനയ്ക്കും പഠനത്തിനുമായി നൽകുന്നു, പ്രവചനമായല്ല. വാണിജ്യേതരം.
കൂടുതൽ ഭക്തിഗ്രന്ഥങ്ങൾ