అన్నమయ్య కీర్తన చక్కని తల్లికి
Sri Venkateswara Swamy · సాంప్రదాయ భక్తి గ్రంథం
రాగం: హంసధ్వని / పాడి ఆ: స రి1 మ1 ప ని3 స అవ: స ని3 ప ద1 ప మ1 రి1 స తాళం: ఆది పల్లవి చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా ॥ (2.5) చరణం 1 కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగుభళా । (2) పలుకుల సొంపుల బతితో గసరెడి చలముల యలుకకు చాంగుభళా ॥ (2) చక్కని తల్లికి చాంగుభళా (ప..) చరణం 2 కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెఱుగులకు చాంగుభళా । (2) ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా ॥ (2) చక్కని తల్లికి చాంగుభళా (ప..) చరణం 3 జందెపు ముత్యపు సరులహారముల చందన గంధికి చాంగుభళా । (2) విందయి వెంకట విభుబెన చినతన సంది దండలకు చాంగుభళా ॥ (2) చక్కని తల్లికి చాంగుభళా (ప..)
అన్నమయ్య కీర్తన చక్కని తల్లికి గురించి
"Chakkani Talliki" is a joyful Annamacharya sankirtana in raga Hamsadhvani (also sung in Padi) and adi tala, in praise of Alamelumanga: "Hail to the lovely Mother, hail! Hail to her sugar-sweet lips!" Each line hails a different part of her beauty with the cheer "changubhala", and the charanams picture her as the beloved of Venkateshwara.
రచయిత: Tallapaka Annamacharya (15th century)
ఎప్పుడు పఠించాలి: In concerts and bhajans, on Fridays, and in Padmavati worship at Tiruchanur.
మీకు తెలుసా?
- "Changubhala" is a Telugu cry of praise, like "well done" or "bravo".
- The song is a favourite opening piece because of its bright, lively rhythm.
తరచుగా అడిగే ప్రశ్నలు
Whom does the song praise?
Alamelumanga (Padmavati), consort of Venkateshwara.
What does "changubhala" mean?
A Telugu cheer of praise, like "bravo".
Which raga is it in?
Hamsadhvani, adi tala, as the text gives.
ఆరాధన, అధ్యయనం కోసం అందించబడింది, జోస్యంగా కాదు. వాణిజ్యేతరం.
మరిన్ని భక్తి గ్రంథాలు