MuhurtaNow

Sri Vengamamba's Mangala Harathi

Durga · Traditional devotional text

శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమంగమ్మకూ (1)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్న పర దైవమునకూ మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకూ (2)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

ఆనంద నిలయమందనిశంబు వసియించి దీనులను రక్షించు దేవునకునూ కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకూ (3)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

పరమొసగ నా వంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకునూ సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ (4)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగించి గైకొనెడి అచ్యుతునకూ ఎలమి పాకంబు జేయించి అందరకన్న మలయకెపుడొసగె మహామాతకూ (5)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

మరియు చిత్రవిచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్య తీర్థములకూ పరగ కనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకూ (6)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శృంగారవన పంక్తులకునూ మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులగు పాకశాలలకునూ (7)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

అహి వైరి ముఖ్యవాహనములకు గొడుగులకు రహినొప్పు మకరతోరణములకునూ బహువిధ ధ్వజములకు పటు వాద్య వితతులకు విహిత సత్కళ్యాణ వేదికలకూ (8)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

దర చక్ర ముఖ్య సాధనములకు, మణిమయాభరణ దివ్యాంబర ప్రతతులకునూ కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభకరమైన దివ్య మంగళ మూర్తికి (9)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

కలిత సుజ్ఞానాది కళ్యాణ గుణములకు, బలమొప్పునమిత ప్రభావమునకునూ వలగొనిన సకలపరివార దేవతలకును, చెలగి పనులొనరించు సేవకులకూ (10)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకునూ పొలుపొందు విశ్వప్రభుత్వుల్లంబునకు నలువొందు వర విమానంబులకునూ (11)

జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం

అరయ తరిగొండ నరహరియగుచు నందరికి వరములొసగే శ్రీనివాసునకునూ మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి సిరుల వెలయుచునుండు శేషాద్రికీ (12)

జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ వేంకటేశ్వర శరణం మమ ॥

About Sri Vengamamba's Mangala Harathi

This is a Telugu mangala harathi (the closing song sung while waving the lamp) by Tarigonda Vengamamba, offered to Lord Venkateshwara of the Seshadri hill and his consort Alamelu Manga. Between its verses runs the refrain "Jaya mangalam, nitya shubha mangalam": victory and auspiciousness, ever and always.

Written by: Tarigonda Vengamamba (18th century), as its title states

When to chant: At the end of puja or bhajan, while offering harathi, especially to Venkateshwara.

Did you know?

  • Vengamamba was a Telugu poet-saint and devotee of Venkateshwara who lived at Tirumala; her verse names her home village deity, Narasimha of Tarigonda.
  • Her "Mutyala Harathi" (pearl harathi) is traditionally offered at Tirumala every night at the Ekanta Seva, the last service of the day.
  • The great free-meal hall at Tirumala, the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex, is named after her.

Frequently asked questions

Who was Tarigonda Vengamamba?

An 18th-century Telugu poet-saint, devotee of Lord Venkateshwara, who wrote many works and lived at Tirumala.

What is a mangala harathi?

The auspicious closing song sung while waving the lamp before the deity.

When is it sung?

At the end of puja and bhajans, while offering harathi.

Offered for worship and study, not as prediction. Non-commercial.