MuhurtaNow

ದೇವೀ ಮಾಹಾತ್ಮ್ಯಂ ಮಂಗಳ ನೀರಾಜಣಂ

Devi · ಸಾಂಪ್ರದಾಯಿಕ ಭಕ್ತಿ ಪಠ್ಯ

శ్రీ చక్ర పురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకు నీరాజనం పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశీ ఆ సింహమధ్యకు రత్న నీరాజనమ్ ॥ ॥ శ్రీ చక్ర పురమందు ॥

బంగారు హారాల శింగారమొలకించు అంబికా హృదయాన నీరాజనం శ్రీ గౌరీ శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనమ్ ॥ కల్పతరువుగ నన్ను కాపాడే కరములకు కనకంబురాశులతో నీరాజనం పాశాంకుశ పుష్ప బాణ చాపధరికి పరమపావనమైన నీరాజనమ్ ॥ ॥ శ్రీ చక్ర పురమందు ॥

కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కల్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపుకుంకుమలు కాపాడే కాత్యాయనికి నిత్య నీరాజనమ్ ॥ సిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరేకులవంటి కన్నుల తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనమ్ ॥ ॥ శ్రీ చక్ర పురమందు ॥

ముదమార మోమున ముచ్చటగా ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరమకుటంబులో దాల్చు సౌందర్యలహరికి నీరాజనమ్ ॥ శుక్రవారము నాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదా మాతకు నీరాజనమ్ ॥ ॥ శ్రీ చక్ర పురమందు ॥

ఎల్లలోకాలను చల్లగా పాలించు బ్రహ్మాండరూపిణికి నీరాజనం ముగ్గురమ్మలకు మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనమ్ ॥ రాధా జీవన రాగ నామ సంకీర్తనగా రంజిల్లు కర్పూర నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరీ నీకు భక్త జనులిచ్చేటి నీరాజనమ్ ॥

శ్రీ చక్ర పురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకు నీరాజనం పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశీ ఆ సింహమధ్యకు రత్న నీరాజనం సింహమధ్యకు రత్న నీరాజనం సింహమధ్యకు రత్న నీరాజనం

ದೇವೀ ಮಾಹಾತ್ಮ್ಯಂ ಮಂಗಳ ನೀರಾಜಣಂ ಬಗ್ಗೆ

ಮಂಗಳ ನೀರಾಜನ ದೇವೀ ಪೂಜೆ ಮತ್ತು ದೇವೀ ಮಾಹಾತ್ಮ್ಯ ಪಾರಾಯಣದ ಕೊನೆಯಲ್ಲಿ ಹಾಡುವ ತೆಲುಗು ಆರತಿ ಹಾಡು. "ನೀರಾಜನ" ಎಂದರೆ ದೀಪ ಬೆಳಗುವುದು; ಶ್ರೀಚಕ್ರಪುರದಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ನೆಲೆಸಿದ ಶ್ರೀ ಲಲಿತೆಯ ಚಿನ್ನದ ಪಾದಗಳಿಗೆ ಈ ಹಾಡು ದೀಪವನ್ನು ಅರ್ಪಿಸುತ್ತದೆ.

ಯಾವಾಗ ಪಠಿಸಬೇಕು: ದೇವೀ ಪೂಜೆಯ ಕೊನೆಯಲ್ಲಿ, ದೇವೀ ಮಾಹಾತ್ಮ್ಯ ಅಥವಾ ಲಲಿತಾ ಸಹಸ್ರನಾಮ ಪಾರಾಯಣದ ನಂತರ ಮತ್ತು ನವರಾತ್ರಿಯಲ್ಲಿ.

ನಿಮಗೆ ಗೊತ್ತೇ?

  • "ಮೂವರು ಅಮ್ಮಂದಿರಿಗೆ ಮೂಲವಾದ ದೊಡ್ಡಮ್ಮ"ನಿಗೆ, ಅಂದರೆ ಲಕ್ಷ್ಮಿ, ಸರಸ್ವತಿ, ಪಾರ್ವತಿಯರ ಮೂಲಶಕ್ತಿಗೆ, ಒಂದು ಚರಣ ಮುತ್ತಿನ ಆರತಿ ಅರ್ಪಿಸುತ್ತದೆ.
  • ಶ್ರೀಚಕ್ರವನ್ನು (ಶ್ರೀಯಂತ್ರ) ದೇವಿಯ ನಗರವೆಂದೂ ಅದರ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಲಲಿತೆಯಿರುವಳೆಂದೂ ಚಿತ್ರಿಸಲಾಗಿದೆ.
  • ತೆಲುಗು ಮನೆಗಳಲ್ಲಿ ಕರ್ಪೂರದ ಆರತಿ ಬೆಳಗುವಾಗ ಇಡೀ ಕುಟುಂಬ ಸೇರಿ ಈ ಹಾಡನ್ನು ಹಾಡುವುದು ಸಾಮಾನ್ಯ.

ಪದೇ ಪದೇ ಕೇಳುವ ಪ್ರಶ್ನೆಗಳು

ನೀರಾಜನ ಎಂದರೇನು?

ದೇವರ ಮುಂದೆ ಬೆಳಗಿದ ದೀಪಗಳನ್ನು ಆರತಿ ಮಾಡುವುದು; ಆರತಿ ಅಥವಾ ಹಾರತಿ ಎಂದೂ ಕರೆಯುತ್ತಾರೆ.

ಮಂಗಳ ನೀರಾಜನವನ್ನು ಯಾವಾಗ ಹಾಡುತ್ತಾರೆ?

ದೇವೀ ಪೂಜೆ ಅಥವಾ ದೇವೀ ಮಾಹಾತ್ಮ್ಯ ಪಾರಾಯಣದ ಕೊನೆಯಲ್ಲಿ, ವಿಶೇಷವಾಗಿ ನವರಾತ್ರಿಯಲ್ಲಿ.

ಇದು ಯಾವ ಭಾಷೆಯಲ್ಲಿದೆ?

ತೆಲುಗು.

ಆರಾಧನೆ ಮತ್ತು ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ ನೀಡಲಾಗಿದೆ, ಭವಿಷ್ಯವಾಣಿಯಾಗಿ ಅಲ್ಲ. ವಾಣಿಜ್ಯೇತರ.